గణపవరంలో ప్రసంగంలో భాగంగా పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. రైతుల్ని మోసం చేయడంలో సీబీఐ దత్తపుత్రుడు జగన్‌ని మించిన వాళ్ళు మరెవ్వరు ఉండరని విమర్శించారు. వైకాపా చెప్పిన లెక్కల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు కలుపుకుంటే ప్రతి రైతుకు రూ. 19,500 రావాలని.. కానీ జగన్ ప్రభుత్వం ఇస్తోంది కేవలం…