వల్లభనేని వంశీ రెండు రోజుల కస్టడీ పూర్తి అయింది.. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నమోదైన కేసుకి సంబంధించి వంశీని రెండ్రోజుల పాటు పోలీసులు విచారించారు. వంశీని 30కిపైగా ప్రశ్నలు అడిగారు. నకిలీ ఇళ్ల పట్టాలను ఎక్కడ ఎవరు ఎందుకు తయారు చేసారని వంశీని పోలీసులు ప్రశ్నించారు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయాల్ని అడిగారు. తనకు నకిలీ పట్టాలతో సంబంధం లేదని వంశీ సమాధానం చెప్పారు.