ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మంత్రులు.. ఇక రోజులు లెక్కపెట్టుకోండి అని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై సరిగ్గా స్పందించకున్నా.. కార్యకర్త, నాయకులకు గౌరవం ఇవ్వకున్నా.. మీ ప్లేస్‌లో కొత్తవారు వస్తారని మంత్రులకు స్పష్టం చేశారు. ఇక నుంచి మీరు 1995 సీఎంను చూస్తారని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. నేడు సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో 12 అంశాలపై చర్చించారు. మంత్రులు ఎవరూ సంతృప్తికరంగా…