ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కేసునలో చాలా తక్కువ సమయంలో పరిష్కరించారు ఏపీ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి . 60 ఏళ్ల వివాదానికి లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పరిష్కారం చూపించారు. 1962లో భర్త మృతితో పెన్షన్ కోసం 60 ఏళ్లుగా పోరాడుతున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కృష్ణవేణికి న్యాయం జరిగేలా తీర్పును ఇచ్చారు.
ఏపీలో మూడురాజధానుల్లో భాగంగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలులో ఇంతకుముందే ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం మూడో నెంబరు గదిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ప్రారంభించారు. ఇంతవరకు హైదరాబాద్‌లో కొనసాగిన లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యకలాపాలను ఇకపై కర్నూలు నుంచి నిర్వహిస్తారు. తాజాగా కర్నూలు సంతోష్ నగర్ లో లోకాయుక్త నూతన కార్యాలయాన్ని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రారంభించారు.…