ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. లాటరీ ద్వారా కేటాయిస్తుండటంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే 17 వందల 97 కోట్ల 64 లక్షల ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 113 షాపులకు 5 వేల 825 అప్లికేషన్స్ వచ్చాయి
ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం కానుంది. కొత్త మద్యం విధానంపై కీలక విషయాలను మంత్రివర్గ ఉపసంఘం మీడియా సమావేశంలో వెల్లడించింది. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్ , సత్య ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్‌లు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. 6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించామని వారు తెలిపారు.
మద్యం పాలసీ రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.
ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్‌లు ఉండనున్నారు.
గత ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది. మైండ్ ఉండే ఎవ్వడూ ఈ తరహాలో ఎక్సైజ్ పాలసీ రూపొందించరు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.. ఏం చేసినా జరిగిపోతోందనే అహకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. పాత బ్రాండ్లను తప్పించారు.. కొత్త బ్రాండ్లను తెచ్చారని ఫైర్ అయ్యారు
బార్ల మద్యం పాలసీ వ్యవహారం హైకోర్టుకు చేరింది.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది… అయితే, పిటిషనర్ల తరపున వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. సంబంధిత జీవోపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.. ఇక, రేపటి నుంచి వేలం ప్రారంభమవుతుందని, నాన్ రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డిపాజిట్ తిరిగి ఇవ్వబోమని ప్రభుత్వం చెబుతోందని, దీనివల్ల నష్టపోతారని ధర్మాసనానికి వివరించారు. వాదనలు విన్న…