ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్ జర్నలిస్టులు.. ఇటీవల జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు కేటాయిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నందకు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
జర్నలిస్టులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. త్వరలో రాష్ట్రంలోని 25 వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఇవాళ సమాచార, ప్రసారశాఖ మంత్రి పేర్ని నాని, అధికారులతో సమావేశమైన ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు… వార, పక్ష, మాస పత్రికలకు సర్క్యులేషన్ బట్టి అక్రిడేషన్లు కేటాయించాలని తెలిపారు. దీంతో.. అక్రిడేషన్ల కోసం ఎదురుచూస్తోన్న…