కొప్పుగుండపాలెం గ్రామానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రాబోతున్నారు. మృతురాలి బంధువులను కలిసి పరామర్శించునున్నారు. విద్యార్థిని దారుణ హత్యకు గురవడంతో గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. నిందితుడిని తమకు అప్పగించాలంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఏపీలో గంజాయి లేకుండా చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో గంజాయి కట్టడికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గంజాయికి సంబంధించి ఏపీ సర్కారు బంపరాఫర్ ఇచ్చింది. గంజాయికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చిన వారికి నగదు రివార్డు ఇస్తామని హోంమంత్రి వెల్లడించారు.
గంజాయి వ్యాపారులు, వినియోగదారులకు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు సేఫ్ గేమ్ మానేయాలని, ఓన్లీ స్ట్రయిట్ గేమ్స్ వుండాలని మంత్రి సూచించారు. మూడు నెలలు టైం ఇస్తున్నామని, పోలీసులు మారకపోతే మేం మార్పు చూపిస్తామని హెచ్చరించారు.
హోం మంత్రి తానేటి వనితపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా తానేటి వనిత రాజీనామా చేయాలన్నారు. తల్లులను బయటికి తీసుకొచ్చి హోంమంత్రి కించపరుస్తూ ఉన్నారు. రేపల్లె రైల్వే స్టేషన్లో అత్యాచారం ఘటన ఏ తల్లి పెంపకం తప్పో హోంమంత్రి చెప్పాలి. మీ చేతగానిపాలన అసమర్ధ పాలన వల్ల…
గంజి ప్రసాద్ హత్య బాధాకరం అన్నారు హోం మంత్రి తానేటి వనిత. గంజి ప్రసాద్ హత్య కేసులో ముగ్గురు నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయారన్నారు. అనుమానితుడైన ఎంపీటీసీ బజరయ్యపై విచారణ సాగుతుందన్నారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారన్నారు. నిందితులు ఏ పార్టీకి చెందిన వారైనా శిక్ష తప్పదు. ముఖ్యమంత్రి దృష్టికి ప్రసాద్ హత్య ఘటన తీసుకువచ్చామన్నారు. ఒకటి రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకుంటాం. ప్రజలు సంయమనం పాటించాలన్నారు మంత్రి…
మహిళలపై దాడి చేయాలంటే వణుకు పుట్టేలా చర్యలు చేపట్టాం… దిశ యాప్ తో మహిళల దశ మారుతుంది అని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలు వాహనాలు చెడిపోయినా దిశా యాప్ ను ఆశ్రయిస్తున్నారు… మహిళా రక్షణ కు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే అందుకు కారణం. ప్రకృతి వైపరీత్యాలను ఆపలేం… కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఎలాగో మా ప్రభుత్వానికి తెలుసు. ముఖ్యమంత్రిపై కామెంట్లు చేసి ప్రజాగ్రహాన్ని టిడిపి చవిచూసింది. వైసీపీ…
అగ్రిగోల్డ్ సంస్థ 32 లక్షల మంది దగ్గర 6500 కోట్లు వసూలు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సెబీ పర్మిషన్ లేకుండా అగ్రిగోల్డ్ సంస్థను ప్రారంభించారు. చంద్రబాబు ఉన్నప్పుడు సంస్ధను ప్రారంభించారు… చంద్రబాబు ప్రభుత్వం లోనే అగ్రిగోల్డ్ కుంభ కోణం బయటపడింది అని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3500 కోట్లు అగ్రిగోల్డ్ డబ్బులు దోచుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు న్యాయం చేస్తానని చెప్పి హయ్ ల్యాండ్ మీద కన్నేశారు.…
మహిళల భద్రత కోసం దిశా చట్టాన్ని తీసుకుని వచ్చాం. ఈ చట్టం వచ్చిన తర్వాత విచారణ, శిక్ష ఖరారు వేగంగా జరుగుతోంది అని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. 2019లో 100 రోజుల్లో విచారణ పూర్తి చేస్తే ఈ ఏడాదిలో 42 రోజుల్లోనే విచారణ పూర్తి చేసే పరిస్థితి ఉంది. 2,114 కేసులను 40 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు వాళ్ళు కూడా అమల్లోకి…
గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ దుండగుడు విద్యార్థినిని కత్తితో పొడిచి చంపాడు. ఓ ప్రైవేట్ కళాశాలలో ఆమె మూడ సంవత్సరం చదువుతోంది. అయితే… ఇవాళ ఉదయం ఒంటరిగా ఉన్న రమ్యను చూసి… కత్తితో దాడిచేసి హతమర్చాడు. అయితే.. ఈ ఘటన పై హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ… బీటెక్ విద్యార్దిని రమ్యను తెలిసిన వ్యక్తే హత్య చేశాడు. హత్యకు ముందు ఘర్షణ పడ్డారు. పరిచయం వున్న వ్యక్తే అయినా…