AP Heavy Rains Holiday: ఏపీలోని పలు జిల్లా్ల్లో వర్షం దంచికొడుతోంది. అకాల వర్షానికి జనా జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో రేపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు కారణంగా పాఠశాలలకు సెలవు ఇచ్చారు. ఇళ్లలోనే ఉండాలని తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్లు సూచించారు.