ఏపీ వైద్య శాఖలో బదిలీల వివాదం రాజుకుంది. ఐదేళ్లు సర్వీసు పైబడిన వారికి స్థాన చలనం కలిగించాలన్న ఆదేశాలను వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ఎంసీఐ నిబంధనల మేరకు పరిశోధనలపైన తీవ్ర ప్రభావం చూపిస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. వైద్యశాఖలో జీవోఆర్టీ నెంబర్ 40 కుదుపు మొదలైంది. ఈ ఆదేశాల ప్రకారం ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసు కున్న వైద్యులను బదిలీ చేయాలిసి ఉంటుంది. మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు కూడా బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో కౌన్సెలింగ్…