ఏపీలో సంచలనం కలిగించిన తణుకు టీడీఆర్ బాండ్ల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ స్కాం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందన్నారు. తణుకు టీడీఆర్ బాండ్ల జారీ విషయంలో టీడీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తణుకులో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు అధికారులతో కుమ్మక్కయ్యారన్నారు. ఈ అక్రమాలపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పది రోజుల క్రితమే నాకు ఫిర్యాదు చేశారు. కారుమూరిపై టీడీపీ ఆరోపణలు…