పీఆర్సీ విషయంలో విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం, ఉద్యోగులూ ఒకే టీం. సమస్యలు ఇరు పక్షాలకూ తెలుసు. కాబట్టి దీనిలో విజయం, వైఫల్యం అంటూ ఏమీ లేదన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆందోళనలు ప్రజాస్వామ్యంలో ఒక ఎక్స్‌ప్రెషన్ గానే ప్రభుత్వం చూసింది. రాష్ట్ర సొంత ఆదాయం రెండున్నర ఏళ్ళ కిందట ఉన్న దగ్గరే ఆగిపోయిందన్నారు సజ్జల. 80 వేల కోట్లకు పైగా ఆదాయం ఉంటే ఉద్యోగులు…