ఏపీలో జూనియర్ కాలేజీల ఫీజులు ఖరారు చేసింది ప్రభుత్వం. గ్రామ, మున్సిపాల్టీ, కార్పోరేషన్ వారీగా ఫీజులను నిర్ధారించింది ప్రభుత్వం. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కాలేజీలలో ఎంపీసీ, బైపీసీలకు రూ.15,000 ఇతర గ్రూపులకు రూ.12,000 గా నిర్ధారించింది. ఇక మున్సిపాలిటీల పరిధిలోని కాలేజీలలో ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500 ఇతర గ్రూపులకు రూ.15,000 గా… అలాగే కార్పొరేషన్ల పరిధిలోని కాలేజీలలో ఎంపీసీ, బైపీసీలకు రూ.20,000 ఇతర గ్రూపులకు రూ.18,000 గా స్పష్టం చేసింది. అయితే కరోనా కారణంగా గత…
రమ్య మరణం పట్ల సమాజం దిగ్భ్రాంతి చెందింది. ఇంతటి అరాచకం నా రాజకీయం లో చూడలేదు అని మాజీ మంత్రి ఆలపాటి రాజ అన్నారు. ఒక విద్యార్థిని హత్య జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ పై కేసులా… పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కేసులు పెట్టిన తీరు కేసుల్లో చెప్పిన సమయానికి పొంతన లేదు. పోలీస్ అధికారులు నిస్పక్ష పాతం గా వ్యవహరించాలి. పోలీస్ లు రక్షకులు గా కాదు భక్షకులు గా మారి పోయారా…
ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవో విడుదల చేసిన 24 గంటల్లో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ పిల్ పై సీజే హిమాకోహ్లీ, జస్టిస్ విజయ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపారు. నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధుకు నిధులు విడుదల చేశారన్నారు పిటిషనర్.…
సీఎంకు బహిరంగ లేఖ రాస్తాను. 2015లో రాయచోటి లో నమోదైన కేసును ఎత్తివేయడం దుర్మార్గం. ముఖ్యమంత్రిలో మతతత్వ వైఖరి కనపడుతోంది అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ముస్లిం లపై కేసులు ఎత్తివేస్తున్నారు.. జగన్ సెక్యులర్ ముఖ్యమంత్రి అవునా… కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ జీవో లను ఆన్ లైన్ లో నుంచి తీసివేయడం దారుణం. టిప్పు సుల్తాన్ కన్నా అబ్దుల్ కలాం విగ్రహం పెట్టవచ్చు కదా. వక్ఫ్ బోర్డ్ లకు ప్రభుత్వ…
ఏపీ తాలిబన్ రాజ్యంగా మారింది. పోలీసుల గన్నులు పెట్టి జగన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు అని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడే మహిళలకు రక్షణ లేకుండా పోయింది.ప్రతిపక్ష పార్టీగా మాకు నిరసన చేసే హక్కులేదా… నిరసనలు ,పరామర్శలు చేస్తే అరెస్టులు చేసేస్తారా అని ప్రశ్నించారు. నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలు చేసిన తప్పేంటి. అసలు రాష్ట్రంలో దిశ చట్టం ఉందా.. అమల్లోకి వచ్చిందా అని అడిగారు. ముఖ్యమంత్రికి పిచ్చిపట్టి ఏం మాట్లాడితే,…
ఇకపై ఆన్ లైన్లో జీవోలు పెట్టకూడదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవోలను ఆఫ్ లైన్ లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పొరుగునున్న రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాన్ని అవలంభించాలని భావించింది ప్రభుత్వం. దాంతో ఇకపై పబ్లిక్ డొమైనులో ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఏవి కనిపించవు. అయితే ఇలా జీవోలను పబ్లిక్ డొమైనుల్లో ఉత్తర్వులు ఉంచడం 2008 న ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ విధానానికి బ్రేక్ వేసింది. చూడాలి మరి ఇంకా…
సింహాచలం, మాన్సాస్ భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఏపీ సర్కార్ ఆదేశించింది. నోడల్ అధికారిగా దేవాదాయశాఖ కమిషనర్ నియమించింది. ఇప్పటికే ప్రాథమిక నివేదికను సమర్పించిన దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ సింహాచలం ఆలయ ప్రాపర్టీ రిజిస్ట్రార్లో 860 ఎకరాల భూములు గల్లంతైనట్టు అంచనా వేస్తోంది. మాన్సాస్ భూముల అమ్మకాల్లో రూ. 74 కోట్లు నష్టం వాటిల్లినట్లు కమిటీ తేల్చింది. ఇప్పటికే అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్, డిప్యూటీ ఈవో సుజాత…
తాడేపల్లి రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు వేంటనే విడుదల చేయాలంటూ ఎస్సీ కార్యాలయం ముందు బైఠాయించారు. ధర్నా చేస్తున్న బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ తో పాటు పలువురు నేతలను అరెస్టు చేసారు పోలీసులు. ఇక ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ మాట్లాడుతూ… రెండేళ్ల లో…
టీటీడీ బోర్డు చైర్మన్గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు సీఎం వైఎస్ జగన్… దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అదృష్టం అందరికి రాదు.. నాకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నానన్న ఆయన.. బోర్డు చైర్మన్ పదవి తీసుకోవడంలో నాకు అసంతృప్తి లేదన్నారు. ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనటం సాధ్యం కావడం లేదనేది నిజమే.. కానీ, భవిష్యత్…