ఎన్నికల సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఉద్యోగాల నుంచి తొలగిస్తోందని.. 410 మంది ఉద్యోగులను ఫైబర్ నెట్ నుంచి తొలగిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇస్తాం అని చెప్పిన భృతి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.