BV Raghavulu: రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. రాష్ట్రం పరిశ్రమల రంగంలో వేగంగా ముందుకు వెళ్తోందన్న కూటమి నాయకుల వ్యాఖ్యలు మాటలకే పరిమితమైపోయాయని ఆయన అన్నారు. విశాఖలో రాఘవులు మాట్లాడుతూ, గత ప్రభుత్వాల కాలంలో కూడా ఎన్నో పెట్టుబడుల సదస్సులు జరిగినప్పటికీ, వాటిలో కుదిరిన ఒప్పందాల్లో 10 శాతం కూడా అమలుకాలేదని గుర్తుచేశారు. భూములు పొందడానికే కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని, కానీ,…