YS Jagan : రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభం నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం పార్లమెంట్‌లో గట్టిగా పోరాడాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలకు స్పష్టం చేశారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలకు ముందుగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ దిశానిర్దేశాలు జారీ చేశారు. జగన్ మాట్లాడుతూ ‘మొంథా’ తుపాను కోస్తా జిల్లాల్లో భారీ విధ్వంసం సృష్టించిందని, లక్షల ఎకరాల్లో పంటలు నాశనమై…