పార్టీలో నిజంగా కష్టపడ్డ కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది.. ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు దూరంగా ఉంటున్నారో తెలుసుకోవడం కష్టమైన పని ఏమి కాదని ఆయన చెప్పారు. కార్యకర్తల్లో కనిపిస్తున్న ఉత్సాహం సఫలీకృతమయ్యే సమయం ఆసన్నం అయిందని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
కాకినాడ జిల్లా తునిలో తండ్రి దాడిశెట్టి రాజా గెలుపు కోసం తనయుడు దాడిశెట్టి శంకర్ మల్లిక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన తండ్రికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాడు.
ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని భుజబలపట్నం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సతీమణి దూలం వీర కుమారి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 3వ తేదీన పెదకూరపాడు నియోజకవర్గానికి విచ్చేస్తున్నారని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు తెలిపారు.
ఈ రోజు కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్.. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం.
పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే డీబీటీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణిపై ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే కాగా.. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా.. ఇవాళ ఉదయం 8:30 గంటల నుంచి 11 గంటలలోపు డీబీటీ ద్వారా అకౌంట్లలో పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారు. మే 1న పెన్షన్లు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.