Cyclone Effect: మొంథా తీవ్ర తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తుంది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. తీరానికి సమీపించే కొద్దీ దీని ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాన్ కారణంగా గంటకు 100 కిలోమీటర్లకు పైబడిన వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. విశాఖపట్నంలోని డాప్లర్ రాడార్‌తో పాటు తుఫాన్ హెచ్చరిక కేంద్రం ఈ తుఫాన్ పరిస్థితిని పరిశీలిస్తోంది.
Read Also: Warangal: ప్రేమవిఫలమైందని యువకుడి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్
ఇక, గాలుల దిశ, వేగం నిమిషానికోసారి అంచనా వేయడానికి GPS “వన్ డే బెలూన్”ల ద్వారా వాతావరణ పరిస్థితులను ఐఎండీ పరిశీలిస్తుంది. ఈ బెలూన్ల ద్వారా వచ్చే డేటా ఆధారంగా కీలక ఆదేశాలు, సలహాలు ఇస్తున్నారు. అయితే, రాబోయే మరి గంటల్లో సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, తుఫాన్ గాలులు వీసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా అప్రమత్తమైన అధికారులు, కాకినాడలోని ఉప్పాడ బీచ్ రోడ్డును మూసివేశారు. అలాగే, సముద్రంలో కార్తీక స్నానాలు చేయడానికి ఎవరూ రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తుఫాన్ ప్రభావిత మండలాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.