అవకాశం ఉన్న ఏ చోటునూ వదలకుండా విస్తరించుకుంటూ పోయేందుకు సీపీఐ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్ లోనూ తమ వాణి వినిపించేందుకు.. అక్కడ సైతం జనాల్లో ఎంతో కొంత పట్టును పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే అమరావతి పోరాటంలో సీపీఐ నేతలు కాస్త క్రియాశీలకంగా ముందుకు పోతున్నారు. ఇతర సమస్యలపైనా.. ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. తాజాగా.. ఆ పార్టీ జాతీయ నాయకత్వం సైతం ఆంధ్రాపైనే దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పార్టీకి మైలేజ్ పెంచే దిశగా ఓ నిర్ణయాన్ని తీసుకుంది.…