ఏపీలో కాక రేపుతున్న పీఆర్సీ అంశంపై ఒక నిర్ణయానికి రానుంది ప్రభుత్వం. సీఎం జగన్ తో మంత్రుల కమిటీ భేటీ కానుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో పది గంటలకు ముఖ్యమంత్రితో సమావేశం కానుంది మంత్రుల కమిటీ. నిన్న స్టీరింగ్ కమిటీ లో జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి వివరించనుంది మంత్రుల కమిటీ. హెచ్ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శ్లాబులు, సీసీఏ రద్దు, మట్టి ఖర్చులు అంశాలపై ఖజానా పై పడే ఆర్ధికభారం, ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలను…
శ్రీ సిటీలో నోవా ఎయిర్ ప్లాంట్‌ను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో మెడికల్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గోన్ వాయువుల తయారీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్ ఎండీ గజనన్‌నబర్, కమర్షియల్ హెడ్ శరద్ మధోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. రోజుకు220 టన్నుల ఆక్సిజన్ తయారీ ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్ ఉద్దేశమన్నారు. కేవలం 14 నెలల్లో ప్లాంట్ ప్రారంభం కావడం…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం. రిపబ్లిక్ డేకి ఎంతో సమయం లేకపోవడంతో అధికారులు భారీ ఏర్పాట్లుచేశారు.
సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా ఏపీ టికెట్ రేట్లపై ఇష్యూ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఈ వివాదంపై సైలెంట్ గా ఉన్న మోహన్ బాబు టికెట్ల ధరలపై రేపు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది. సినిమా టికెట్ల ధరలపై తొలిసారి మోహన్‌బాబు స్పందించబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. Read Also : టాలీవుడ్ లో సంక్రాంతి సంబరం… పోటీకి సై అంటున్న చిన్న సినిమాలు !! మరోవైపు అల్లూరి సీతారామ రాజు…
నేడు కృష్ణా జిల్లాలో జగనన్న పాలవెల్లువ పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణతో ప్రభుత్వం మార్కెట్లోకి ప్రవేశించి రైతులకు మంచి ధరలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. దీనివల్ల వ్యాపారులు కూడా మంచి ధరలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని, నిర్ణయించిన ధరకు లేక అంతకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ధరల స్థిరీకరణ నిధిద్వారా రైతులకు తోడుగా నిలవగలిగామని ఆయన వెల్లడించారు.…
ఏపీలో ఇళ్ల పట్టాలు సహా 16 పథకాలకు అర్హులైనా లబ్దిపొందని వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్ మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ మొదటిసారి 2009లో కడప పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అయితే, 2009 సెప్టెంబర్ 2 వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ ఒదార్పు యాత్ర చేసేందుకు సంకల్పించారు. కాంగ్రెస్ పార్టీ అందుకు అనుమతించకపోవడంతో విభేదించి 2011, మార్చి 11 వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో…
భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతిలో కూడా మునుపెన్నడూ చూడనటువంటి వరదలు తలెత్తాయి. వరద ప్రభావిత ప్రాంతాలపై ఇప్పటికే ఆరా తీసిన సీఎం జగన్ ఈనెల 2న స్వయంగా తానే జనం దగ్గరకు వెళ్లనున్నారు. నేరుగా వరద బాధితులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇప్పటికే పంట, ప్రాణ నష్టం పై వివరాలను జగన్ తీసుకున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని…