ఏపీ;లో టికెట్ ధరలు, థియేటర్ల సమస్యలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇదే నెలలో రెండు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండడంతో అందరి దృష్టి ఆంధ్రా ప్రభుత్వం కొత్త జీవోను ఎప్పుడు జారీ చేస్తుంది ? అనే దానిపైనే ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం టికెట్ ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం విడుదల చేయనున్న కొత్త జీవో బెనిఫిట్ అందుకునే ఫస్ట్ తెలుగు మూవీ “రాధేశ్యామ్” అంటున్నారు. Read also : Radhe Shyam : టైటానిక్…
పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ ఈ చిత్రం అద్భుతమైన డైలాగ్స్, స్క్రీన్ ప్లే, తారాగణం, మ్యూజిక్ తో కోసం అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. అయితే తాజాగా నాగ బాబు ‘భీమ్లా నాయక్’ను ఇబ్బంది పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన యూట్యూబ్ ఛానెల్‌లో సినిమా సమస్యలు, ప్రస్తుతం పరిస్థితుల గురించి ప్రస్తావించారు. సినిమా ఎలా పని చేస్తుందో, దాని కార్యకలాపాలు ఎలా ఉంటాయో తెలియదని…
టాలీవుడ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఏపీలో టికెట్ ధరలపై కొత్త జీవో వస్తుందని ఆశించిన ‘భీమ్లా నాయక్’ నిరాశే ఎదురయ్యింది. అంతేనా సినిమా విడుదల సమయంలో ఏపీ థియేటర్ల వద్ద సీఆర్ఫీఎఫ్ జవాన్లు కన్పించడంపై చర్చ జరిగింది. కానీ ఏపీ మంత్రులు మాత్రం మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా జీవో వాయిదా పడిందని, కావాలంటే జీవో వచ్చేదాకా సినిమాను వాయిదా వేసుకుని ఉండాల్సింది అంటూ సమర్థించుకుంటున్నారు.…
నందమూరి బాలకృష్ణ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనని చెప్పినట్టు కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందని తాను అనుకోవడం లేదని మంత్రి నాని అన్నారు. ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘అఖండ’ సినిమా విడుదలకు ముందు జరిగిన కొన్ని సంఘటనలను మీడియాకు తెలియచేశారు. హైదరాబాద్ లో ఉన్న బిల్డర్ నారాయణ ప్రసాద్ ద్వారా, నూజివీడు ఎమ్మెల్యే ద్వారా ‘అఖండ’ నిర్మాతలు తనని సినిమా విడుదలకు ముందు కలవడానికి విజయవాడ వచ్చారని,…
ఏపీ టికెట్ రేట్లు, థియేటర్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న మొండి వైఖరిపై అన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ విషయంపై పెదవి విరుస్తుండగా, తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. “భీమ్లా నాయక్” సినిమా విషయంలో జగన్ తీరు ఉగ్రవాదాన్ని తలపిస్తోందని మండిపడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి వరుస ట్వీట్లు చేశారు. Read Also :…
ఏపీలో థియేటర్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్కడి చాలా థియేటర్లలో రూల్స్ పేర్లతో ‘భీమ్లా నాయక్’ ప్రదర్శితం కాకుండా అడ్డుకుంటున్నారని నెటిజన్లు అంటున్నారు. పైగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం కొన్ని థియేటర్ల దగ్గర పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కన్పించడం చర్చనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపి ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై కాదు… థియేటర్ల వ్యవస్థ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ సమస్యలపై చిరు బృందం రీసెంట్ గా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తూనే ఉన్నారు. వరుస ట్వీట్లతో భేటీలో పాల్గొన్న ప్రముఖులను టార్గెట్ చేస్తున్నారు. హీరోస్ ఆర్ జీరోస్ అంటూ ఆర్జీవీ చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. Read Also : Ghani : సెన్సార్ కార్యక్రమాలు…
ఫిబ్రవరి 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ తో సినీ ప్రముఖులు జరిపిన సమావేశం ఫలప్రదమైన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోగానే సినిమా రంగానికి సంబంధించిన సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన జగన్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా టిక్కెట్ రేట్ల పైన కూడా ఈ నెల మూడో వారంలోనే ఓ నిర్ణయానికి ప్రభుత్వం వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్ల క్రమబద్ధీకరణ నిమిత్తం…
కేంద్ర బడ్జెట్ ను ప్రశంసిస్తూ.. రాజ్యసభలో వైసీపీ పాలనపై విమర్శలు చేశారు రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 2014-15లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన నిధుల కంటే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అన్నారు జీవీఎల్. 2020-21లో, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.77,538 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ఆంధ్రప్రదేశ్ నుండి సుమారు రూ.55,000 కోట్లు ఆదాయం పొందిందని ఎంపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌పై…