ఏపీ;లో టికెట్ ధరలు, థియేటర్ల సమస్యలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇదే నెలలో రెండు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండడంతో అందరి దృష్టి ఆంధ్రా ప్రభుత్వం కొత్త జీవోను ఎప్పుడు జారీ చేస్తుంది ? అనే దానిపైనే ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం టికెట్ ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం విడుదల చేయనున్న కొత్త జీవో బెనిఫిట్ అందుకునే ఫస్ట్ తెలుగు మూవీ “రాధేశ్యామ్” అంటున్నారు.
Read also : Radhe Shyam : టైటానిక్ తో పోలిక… అసలు కథ చెప్పేసిన పూజా
చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళితో కూడిన టాలీవుడ్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా రాష్ట్రంలోని సినిమా హాళ్లలో టిక్కెట్ ధరలను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించి గత నెలలో కొత్త ఉత్తర్వు (జి.ఓ) జారీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఎంతకూ అది విడుదల కాకపోవడంతో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మేకర్స్ సినిమాను విడుదల చేసేశారు. అయితే ‘భీమ్లా నాయక్” కోసమే ప్రభుత్వం జీవోను ఆపింది అంటూ పవన్ అభిమానులు మండిపడ్డారు. కానీ వైయస్సార్సీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా జీవో వాయిదా పడిందంటూ ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
ఇక మార్చి 11న “రాధేశ్యామ్” థియేటర్లలోకి రానున్నందున ఈ కొత్త టికెట్ల ధరను పొందే మొదటి చిత్రంగా ప్రభాస్ మూవీ నిలుస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఈ వారమే కొత్త జీవో వెలువడనుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే గనుక జరిగితే ‘రాధేశ్యామ్’కు ప్లస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.