టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబుది మాటల ప్రభుత్వమన్న మంత్రి రోజా.. జగన్ మోహన్ రెడ్డిది చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మల్టిపుల్ డిజేబిలిటీతో బాధపడుతున్న రెండున్నర సంవత్సరాల బైపిళ్ళ నారాయణ నిఖిల్‌కు సీఎం జగన్ ఆర్థిక సహాయం చేశారు.
రేపు(శుక్రవారం) కౌలు రైతులకు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. రైతుల ఖాతాల్లో వర్చువల్‌గా సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా సాయం అందనుంది. మొత్తం 1,46,324 మందికి లబ్ది చేకూరనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో వీఆర్‌ఏలకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా వీఆర్‌ఏలు ఎదురుచూస్తున్న అంశంపై ఇవాళ శుభవార్త అందించింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో తొలగించిన ఓ ఆర్ధిక ప్రయోజనాన్ని వారికి తిరిగి కల్పించడంతో పాటు దాన్ని పెంచాలని కూడా నిర్ణయించింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు రెండో రోజు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు.
ఏలూరు జిల్లాలోని కుక్కునూరు మండలం గొమ్ముగూడెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు.