వివిధ పార్టీల నేతలతో ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా భేటీ అయ్యారు. పార్టీలు అనుసరించాల్సిన నిబంధనలపై చర్చించారు. ఎన్నికల కోడ్ అమలు, ఎన్నికల సాఫీ నిర్వహణపై పార్టీలతో ఏపీ సీఈఓ చర్చించారు. మీటింగ్ అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉన్న అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అభ్యర్థి ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలనడం సరైంది కాదని పేర్కొన్నారు. దేశంలోని ఏ…
నారా భువనేశ్వరి చేపడుతోన్న నిజం గెలవాలి కార్యక్రమంపై ఏపీ సీఈఓకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడికి దిగారంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏపీ సీఈఓ ఎంకే మీనాను ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్, నవరత్నాలు వైస్ ఛైర్మన్ నారాయణ మూర్తి కలిశారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ నేను చూడలేదు.. ఆ టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిందే అని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు.