రాజకీయ హింసాత్మక ఘటనలపై మూడు జిల్లాల ఎస్పీలను వివరణ కోరానని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన హత్య రాజకీయ హింసేనని జిల్లా ఎస్పీ చెప్పారన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల ఆఫీసర్ ఎంకే మీనాతో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశం అయ్యారు. డీజీపీ సహా పోలీస్ ఉన్నతాధికారులపై ఎన్డీఏ కంప్లైంట్ చేసినట్లు పేర్కొన్నారు.
రాజకీయ ప్రకటనల విషయమై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏపీ సీఈఓ ఎంకే మీనా సమావేశమయ్యారు. రాజకీయ పార్టీల ప్రకటనల విషయంపై చర్చించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం తప్పని సరి అని సీఈవో రాజకీయ పార్టీ ప్రతినిధులకు సూచించారు.
తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఏపీలో మొత్తంగా 4.08 కోట్ల ఓటర్లున్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితాతో పోల్చుకుంటే 5.85 లక్షల ఓటర్ల మేర పెరిగారని ఆయన చెప్పారు.