ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మందికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మంత్రుల అభీష్టం, వారి సామర్థ్యాన్ని బట్టి శాఖలను కేటాయిస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు.
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. గురువారం ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నూతన సర్కారు కొలువుదీరింది. మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
చంద్రబాబు నేతృత్వంలో నేడు ఏపీ కేబినెట్ కొలువుదీరనుంది. ఏపీ ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
AP Cabinet Meeting: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని క్లీన్ స్వీప్ చేసింది కూటమి. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సీట్లను కైవసం చేసుకుంది. ఇప్పుడు ఏపీ మంత్రివర్గం పైన చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. భారీ మెజార్టీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో కేబినెట్ ఉండేలా కసరత్తు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు…