ఏపీ విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 3వ బ్లాక్‌లో బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విద్యుత్ వ్యవస్థ మీద చాలా పట్టు ఉందని, ఆయన ఈ రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారన్నారు.
రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలిగిందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల సమస్యలు స్వయంగా చూశానని.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మందికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మంత్రుల అభీష్టం, వారి సామర్థ్యాన్ని బట్టి శాఖలను కేటాయిస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు.
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. గురువారం ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారు.