ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. భారీ మెజారిటీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో మంత్రివర్గం ఉండేలా కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఎక్కువగా స్థానాలను కైవసం చేసుకుంది.
జయహో బీసీ సభ వేదికగా తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంపై వేటు వేసింది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేబినెట్ నుంచి జయరాంను బర్తరఫ్ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. మంత్రిమండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది.
ఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. వచ్చే నెల 16వ తేదీ నుంచి రెండు వారాల పాటు చేయూత పథకం నాలుగో విడత చెల్లింపులు జరుపుతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.
మరింత మెరుగైన ఫీచర్స్‌తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపడుతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన ఆరోగ్య శ్రీ కొత్త కార్డుల పంపిణీ చేపడతామన్నారు. ఆరోగ్య శ్రీ విషయంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామన్నారు.
మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో సాబ్జీ మరణం పట్ల మంత్రివర్గం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1లో మంత్రివర్గం సమావేశమవుతోంది. మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలపై చర్చిస్తారు. జనవరి 1 నుంచి 3 వేల రూపాయలకు పెన్షన్ పెంపు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలకు నిధుల విడుదల సహా పలు కీలక అంశాల పై చర్చ జరిగే అవకాశం ఉంది.