ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో అజెండా అంశాలపై ఎలాంటి చర్చ చేపట్టకుండానే వాయిదా పడింది.. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం అయ్యింది.. ప్రముఖ పారిశ్రామికవేత్త.. వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది ఏపీ మంత్రివర్గం
రేపు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో వివిధ కీలక ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం.. కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది.. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 100లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది.. రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారా? ఎప్పటికప్పుడు సమాచారాన్ని వైసీపీ లీడర్లకు చేరవేస్తున్నారా? ఇప్పుడు ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు మంత్రులు.. సచివాయలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. సెక్రటేరియట్‌లోని వివిధ శాఖల్లో వైసీపీ అనుకూలురు ఉన్నారనే అంశంపై చర్చించారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై కీలక చర్చలు జరిగాయి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రులంతా హాజరైన కేబినెట్ సమావేశంలో.. పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది..
సచివాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. అయితే, ఏపీ సర్కార్ మరోసారి పేపర్ లెస్ విధానాన్ని అవలంభిస్తోంది.. ఈ-కేబినెట్ భేటీని నిర్వహించనుంది. 2014-19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఈ-కేబినెట్ నిర్వహించింది. తిరిగి మళ్లీ ఇవాళ్టి నుంచి ఈ-కేబినెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.
కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ఉపాధి హామీ పనుల విషయంలో గ్రామ సభలు నిర్వహించాలని పవన్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాలన్నారు.
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశంలో వెల్లడించారు. మావోయిస్టు పార్టీలపై మరో ఏడాది నిషేధం పొడిగించినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం జారీ చేసిన 217, 144 జీవోలను రద్దు చేశామన్నారు.