ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ బిల్లు - 2024, ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ బిల్లు- 2024 బిల్లులను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు అసెంబ్లీలో మూడు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఏపీ పంచాయితీ రాజ్ బిల్లు - 2024 ను అసెంబ్లీలో డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ ప్రవేశ పెట్టనున్నారు.