వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నిప్పులు చేరిగారు. హిందువులన్నా, హిందూ ఆలయాలన్నా జగన్ ప్రభుత్వానికి చులకనగా కనిపిస్తున్నట్లుందని, హిందువుల సహనాన్ని పరీక్షించాలని చూస్తున్నట్లుందని ఆయన మండిపడ్డారు. ఒక్కసారి హిందువులు తలచుకుంటే తమ ఓటు ద్వారా మీ ప్రభుత్వానికి భవిష్యత్తు లేకుండా చేస్తారని హెచ్చరించారు. మొన్న త్రిపురాంతకంలో అయ్యప్పస్వామి విగ్రహాన్ని తొలగించారు, నేడు గిద్దలూరులో ఏకంగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు గతంలో…
సీఎం జగన్‌కి బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు బహిరంగ లేఖ. ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తానన్న ప్రొత్సహాకాలను ఎందుకివ్వడం లేదని లేఖలో ప్రశ్నించారు సోము వీర్రాజు. పంచాయతీ నిధులకు పారదర్శకత ఏది..? ఏకగ్రీవ పంచాయతీ పాలక మండళ్ళకు ప్రోత్సాహక నగదు ఏది..? అంటూ తన లేఖలో ప్రశ్నలు సంధించారు సోము వీర్రాజు. జీవో విడుదల చేసి నవ మాసాలు నిండినా అమలు చేయరా..? అని అన్నారు. పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే గతంలో వేలల్లో ఉండే ప్రోత్సాహకాన్ని లక్షల్లోకి…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రేపు పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ముంపు గ్రామాల్లోను ఆయన పర్యటన కొనసాగనుంది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల సమస్యలు తీర్చాలని.. వెంటనే పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. R&R ప్యాకేజీని వెంటనే అందజేయాలని సోము వీర్రాజు కోరారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ యథావిధంగా పనిచేస్తుందన్న ఆయన.. దానిని అమ్మే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. ఇక కేసీఆర్,…