ఏపీలో ఏం జరుగుతోంది? నేతలమధ్య అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయా? అంటే అవుననే అంటున్నారు. ఏపీ బీజేపీలో ముసలం పుట్టిందనే వార్తలు పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా విజయవాడలో ఒక హోటల్ లో సమావేశం నిర్వహించారు నేతలు. జాతీయ కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ కు ఆత్మీయసమావేశం పేరుతో సభ ఏర్పాటైంది. ఈ సమావేశానికి బీజేపీ నేతలు కన్నా…