ఆంధ్రప్రదేశ్‌లో మందు బాబులకు గుడ్ న్యూస్.. గత కొంత కాలంగా మద్యం షాపులు బంద్ కానున్నాయంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.. అయితే, రాష్ట్రంలో యథావిధిగానే పని చేయనున్నాయి ప్రభుత్వ మద్యం దుకాణాలు.. బంద్ ని నిరవధికంగా వాయిదా వేసింది ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ సేల్స్ మెన్స్ అండ్ సూపర్వైజర్ల అసోసియేషన్..
గత ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలపై సీఐడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఏపీబీసీఎస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అక్రమాలపై సీఐడీ కూపీ లాగుతోంది. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు.. అక్రమాలు జరిగిన తీరుపై నాటి ఉన్నతాధికారుల నుంచి వివరాలను సీఐడీ తీసుకుంటోంది.