ఏపీలో రాజకీయం రాజుకుంది. అటు టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా టీడీపీ ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిస్తే.. కౌంటర్ గా వైసీపీ కూడా టీడీపీ నేతల వ్యాఖ్యలపై నిరసనలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, పార్టీ నాయకులపై దాడులు ద్వారా అంతర యుద్ధం జరగాలని జగన్ కోరుకున్నాడని ఆరోపణలు చేశారు. జగన్ తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టాడని విమర్శించారు.…