ఆటో డ్రైవర్ల సేవలో డబ్బులు రాని వారు ఎవరో తెలియజేస్తే వారికి ఇచ్చే బాధ్యత నాది అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలోని రోడ్లన్నీ బాగు పడుతున్నాయి.. రూ. 3400 కోట్లతో రోడ్లన్నీ బాగు చేస్తున్నాం.. 23 వేల కిలో మీటర్ల మేర రోడ్ల మరమ్మతులు చేశాము.. గత ఐదేళ్లు రోడ్లపై గుంతలే గుంతలు.. నేను రోడ్లు వేస్తే గత పాలకులు గుంతలు చేశారు.