ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్నారు.. మూడు రోజుల గ్యాప్ అనంతరం ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలు… ప్రశ్నోత్తరాలు, దేవదాయ, ఎక్సైజ్ శాఖలకు చెందిన బిల్లులను ఆమోదించనుంది సభ.. అసెంబ్లీలో వివిధ పద్ధులపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.. ఇక, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు ప్రగతిపై స్వల్ప కాలిక చర్చ సాగనుంది.. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చకు వచ్చే అంశాల విషయానికి వస్తే.. సీఎంఆర్ఎఫ్, మత్స్యకారులకు…