సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోంది. వింటేజ్ మహేష్ లుక్ సినిమాకు హైలైట్ గా నిలవడం, ఎమోషన్స్, కామెడీ టైమింగ్, కీర్తి, మహేష్ ల రొమాన్స్ తో ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాస్ ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ…
శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష సిద్ధాంతి, శ్రీశైల పీఠాధిపతి వీరశైవ పీఠాధిపతి శ్రీ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం పొందారని mulugu.com నిర్వాహకులు కొడుకుల సోమేశ్వర్ రావ్ తెలిపారు. దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిష్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలు, పంచాంగం ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను తన పంచాంగం ద్వారా ప్రజలకు తెలియజేసేవారు. లక్షలాది మందికి మార్గదర్శనం చేయించిన ములుగు సిద్ధాంతి గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. ఎంతోమంది సినీ, రాజకీయ,…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో పులులు, చిరుత పులులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. కొమురం భీం జిల్లా దహెగాం మండలం ఖర్జీ అటవీ ప్రాంతంలో మేకలమందపై పులి దాడి చేసింది. దీంతో భయభ్రాంతులకు గురైన కాపరి మహేష్ చెట్టుపైకి ఎక్కి గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అనంతరం ఎఫ్బీఓలు మధుకర్, రమేష్, రాకేష్, గ్రామస్తులు వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పులి అడవి పందిని తింటుండగా మేకల మంద రావడంతో…
ఉదయం9 గంటలకు రాజ్ భవన్ లో 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం. పాల్గొననున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఏడో రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు. సభ ముందుకు రానున్న కాగ్ నివేదిక చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. వరద నష్టాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వనున్న ఏడుగురు సభ్యుల బృందం. అమరావతిలో…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరొకరి అరెస్టు జరిగింది. దీంతో తెలుగు అకాడమీ కేసులో అరెస్టుల సంఖ్య 16కు చేరింది. బ్యాంకు నుంచి డబ్బులు కొల్లగొట్టాలని ప్లాన్ కృష్ణారెడ్డిదే అని తెలుస్తోంది. సాయి కుమార్ కు సలహా ఇచ్చినందుకు రెండున్నర కోట్లు తీసుకున్నాడు కృష్ణారెడ్డి. మొదట్లో కృష్ణారెడ్డి సాయికుమార్ కలిసి ఫిక్స్డ్ డిపాజిట్ల కొల్లగొట్టడం పై సమావేశాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో వాటాను డిమాండ్ చేయడంతో…