‘బాహుబలి: ది ఎపిక్’ మెగా రీ–రిలీజ్‌కి సంబంధించి ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మహా చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం చుట్టూ మళ్లీ ఉత్సాహం మొదలైంది. ఇప్పటికే ప్రభాస్ ఒక వీడియో బైట్ రిలీజ్ చేస్తూ “ఈ ఇతిహాసాన్ని మళ్లీ పెద్ద తెరపై చూడండి” అంటూ అభిమానులను థియేటర్లకు…