ఒకప్పుడు హిందీ రీమేక్స్ కు తెలుగులో విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా నటరత్న నందమూరి తారక రామారావుదే! ఆయన నటించిన “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాది కాదు ఆకలిది” వంటి హిందీ రీమేక్స్ బాక్సాఫీస్ బరిలో జయకేతనం ఎగురవేశాయి. వాటి సరసన చేరిన చిత్రం యన్టీఆర్ నిర్మించి, నటించిన ‘అనురాగదేవత’. హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషా’ ఆధారంగా ‘అనురాగదేవత’ రూపొందింది. 1982 జనవరి 9న సంక్రాంతి కానుకగా ‘అనురాగదేవత’ జనం…