రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. వర్షానికి తడిసిన ధాన్యం వివరాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని కేటీఆర్ కు జిల్లా కలెక్టర్ వివరించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వాలని, జిల్లా కలెక్టర్ కు మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లాలోని ఎల్లారెడ్డి పేట, వీర్నపల్లి మండలాల…