దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి, బబ్లీ బ్యూటీ అనుపమ పమేశ్వరన్ జంటగా నటించిన ‘రౌడీ బాయ్స్’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీష్ కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్‌లో అనుపమ లిప్‌లాక్‌తో సహా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ అసలు అనుపమలో అలాంటి యాంగిల్ ను అస్సలు చూడని ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు.…