ఒలింపిక్ క్రీడల సమయంలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) చర్యలు తీసుకుంది. మూడేళ్లపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
వివాదాస్పద సంఘటన తర్వాత రెజ్లర్ అంతిమ్ పంఘల్ ఓ వీడియోను విడుదల చేసింది. తన అక్రిడిటేషన్ రద్దు గురించి మాట్లాడుతూ.. తన సోదరిని ఒలింపిక్ క్యాంపస్లోకి ప్రవేశించడానికి తన అక్రిడిటేషన్‌ను ఉపయోగించినట్లు చెప్పింది. కాగా.. మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల తొలి రౌండ్‌లో అంతిమ్ పంఘల్ తొలి మ్యాచ్ లో 0-10తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత తన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని అంతిమ్ పంఘల్ చెప్పింది.
ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లింగ్‌కు కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. వినేష్ ఫోగట్ అనర్హత తర్వాత.. ఒలింపిక్ విలేజ్‌కు భారత రెజ్లర్ యాంటిమ్ పంఘల్ అక్రిడిటేషన్ రద్దు చేయబడింది.