మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్‌కు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మయన్మార్ సరిహద్దులోని న్యూ సమతాల్ గ్రామం సమీపంలో ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో సమాచారాన్ని పంచుకుంటూ.. భారత సైన్యం తూర్పు కమాండ్ మే 14న, స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని ఖెంగ్‌జోయ్ తహసీల్‌లోని…
Bengaluru Cafe Blast Case : కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఘన విజయం సాధించింది. ప్రధాన నిందితుడిని ఏజెన్సీ అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ నేడు చేస్తుంది. ఉగ్రవాదుల, గ్యాంగ్ స్టర్లతో లింకున్న కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఎన్ఐఏ అధికారులు ఇవాళ ఉదయం నుంచి తమిళనాడు, హైదరాబాద్ లో 22 చోట్ల సోదాలు చేసినట్లు తెలిపింది. ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల కోసం విస్తృత తనఖీలు చేసింది.. రెండు రాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లో దాడులు చేయగా.. ఎన్ఐఏ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లోని ఆరు రాష్ట్రాల్లోని 100కి పైగా సోదాలు నిర్వహించింది. వివిధ ఉగ్రవాద గ్రూపులతో గ్యాంగ్‌స్టర్‌లకు, డ్రగ్స్ స్మగ్లింగ్ మాఫియాకు ఉన్న సంబంధాలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ రంగంలోకి దిగింది.
పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య జరిగిన నెల రోజుల అనంతరం జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్‌ఐఏ గ్యాంగ్‌స్టర్లపై దాడులు చేసింది. ఉగ్రవాద గ్రూపులతో లింకు ఉన్న గ్యాంగ్‌స్టర్లపై దాడులు చేస్తోంది.