Anti-Hindu hate: బ్రిటన్ వ్యాప్తంగా హిందూ వ్యతిరేకత పెరుగుతోందని ఓ నివేదిక పేర్కొంది. బ్రిటన్ పాఠశాలల్లో హిందూ విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటున్నట్లు నివేదిక వెల్లడించింది. బ్రిటన్‌లోని పాఠశాలల్లో హిందూ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్ష మరియు బెదిరింపుల గురంచి లండన్ కు చెందిన హేడ్రీ జాక్సన్ సొసైటీ సర్వే నిర్వహించింది. నివేదిక 988 మంది హిందూ తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించింది. వీరిలో 51 శాతం మంది తమ పిల్లలు స్కూల్లలో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని, వివక్షను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.