అమెరికా అంటువ్యాధుల కమిటీ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కరోనా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ కేసులు అమెరికాలో రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను అందిస్తున్నా కేసులు పెరుగుతుండటంపై సర్వత్రా అందోళన పెరుగుతున్నది. కరోనాను సమూలంగా అంతం చేయడం అసాధ్యమని డాక్టర్ ఫౌచీ పేర్కొన్నారు. కరోనాతో కలిసి జీవించాల్సిందే అని కుండబద్దలు కొట్టారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరిలో వైరస్ కనిపిస్తుందని, అయితే, వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఆ వ్యాక్తుల్లో వ్యాధి తీవ్రత…