విలక్షణ దర్శకుడు మణిరత్నం ఏది చేసినా అందులో ఏదో ఒక వైవిధ్యం చోటు చేసుకుంటుంది. జయేంద్ర పంచపకేశన్ తో కలసి మణిరత్నం నిర్మించిన వెబ్ సీరీస్ ‘నవరస’ ఆగస్టు 6 నుండి నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. మణిరత్నం అందించిన సిరీస్ కదా, తెలుగువారికి మొదటి నుంచీ ఆసక్తి కలుగుతోంది. అందుకు తగ్గట్టుగానే తెలుగులోనూ అనువాదమయింది ‘నవరస’. పదాలు తెలుగులోనే వినిపించినా, పాటలు మాత్రం తమిళంలోనే వినిపిస్తాయి. కంగారు పడకండి! ఈ ‘నవరస’ తొలి ఎపిసోడ్…
హీరో నాని ఆ మధ్య నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రధానంగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని సమర్పకుడిగా ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా తెరకెక్కిన ‘అ’, ‘హిట్’ చిత్రాలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి, ప్రేక్షకాదరణ సైతం పొందాయి. ‘అ’ మూవీతో ప్రశాంత్ వర్మ, ‘హిట్’తో శైలేష్ కొలను లను దర్శకులుగా పరిచయం చేసిన నాని, ఇప్పుడు తన అక్కయ్య దీప్తి గంటా చేతికి మెగా ఫోన్ ఇచ్చాడు. అయితే… ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమా…
ఎంటర్టైన్మెంట్ అంటే పెద్ద తెర లేదంటే బుల్లితెర! నిన్న మొన్నటి వరకూ ఇంతే… కానీ, ఇప్పుడు సీన్ మారింది. కరోనా గందరగోళానికి ముందే ఓటీటీ హంగామా మొదలైంది. కానీ, పోయిన సంవత్సరం లాక్ డౌన్ తో డిజిటల్ స్ట్రీమింగ్ వేగం పుంజుకుంది. ఇక ఈ సంవత్సరం కూడా వైరస్ విజృంభిస్తుండటంతో స్టార్ హీరోల సినిమాలే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పైకి వచ్చేస్తున్నాయి. అయితే, సినిమాల సంగతి ఎలా ఉన్నా ఓటీటీల వల్ల వెబ్ సిరీస్ లు, యాంథాలజీలు…