కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనా షాజన్(26) దుర్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన కేరళలో సంచలనంగా మారింది. సోమవారం ఉదయం ఒంటిగంట సమయంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్, రన్నరప్ అంజనా షాజన్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో వస్తుండగా ఎర్నాకుళం బైపాస్‌లోని హాలిడే ఇన్ ముందు బైక్ ని తప్పించబోయి కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో…