Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనలో ఆయనకు తిరుగులేరు.. అలాగే పెయింటింగ్ లో కూడా.. ఆయనకు సాటి లేరు. ఇక ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూస్తాయి.. బ్రహ్మీ కేవలం నవ్వించడమే కాదు.. కొన్నిసార్లు ఏడిపిస్తారు కూడా..
నాలుగు దశాబ్దాల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల వాయిదా పడుతూ వచ్చి ఇటీవల విడుదలైన సినిమా ‘ప్రతిబింబాలు’. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా జయసుధ, తులసి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కెయస్. ప్రకాశరావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకులు. ఈ సినిమాను జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించగా రాచర్ల రాజేశ్వర్ విడుదల చేశారు. ఈ సినిమా శతదినోత్సవ వేడుకలను బుధవారం చిత్తూరు జిల్లా అరగొండ కృష్ణటాకీస్ లో నిర్వహించారు. ఈ శతదినోత్సవానికి కారకులైన ఇ. శంకర్ రెడ్డికి, విడుదలకు…