Akkineni Nagarjuna: అక్కినేని.. ఒక బ్రాండ్. ప్రస్తుతం అక్కినేని కుటుంబం మొత్తాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటే దానికి కారణం.. ఒక మహావృక్షమైన అక్కినేని నాగేశ్వరరావు వలనే. ఆయన వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. ఇప్పుడు నాగ్ వారసులుగా అడుగుపెట్టిన చైతన్య, అఖిల్.. ఇలా ఈ వంశ వృక్షం కొనసాగుతూనే ఉంటుంది.
Manchu Mohan Babu: మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రూటే సపరేటు. అంతకుముందు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ లా ఉండే మోహన్ బాబు ఈ మధ్య సినిమాలు తగ్గించడమే కాకుండా మీడియా ముందుకు కూడా రావడం లేదు.
Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనలో ఆయనకు తిరుగులేరు.. అలాగే పెయింటింగ్ లో కూడా.. ఆయనకు సాటి లేరు. ఇక ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూస్తాయి.. బ్రహ్మీ కేవలం నవ్వించడమే కాదు.. కొన్నిసార్లు ఏడిపిస్తారు కూడా..