బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తేమి కాదు… నిత్యం ఆమె వివాదాలతోనే జీవిస్తోంది. ఇక ఇటీవల పద్మశ్రీ అందుకున్న హాట్ బ్యూటీ భారత స్వాతంత్య్రం గురించి కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది. సరే కొద్దిరోజుల్లో ఆ వివాదం ముగుస్తుంది అనుకోనేలోపు సిక్కు మతాల గురించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి తెరలేపింది. దీంతో ఆమెపై ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ, శిరోమణి అకాలీదళ్ ముంబై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు…