బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. తాజాగా బుధవారం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ఏర్పడగానే జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్స్) దీదీలను పర్మినెంట్ చేసి.. నెలకు రూ.30,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చారు.
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స కోసం నితిన్ గడ్కరీ పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించిన తర్వాత... బాధితులకు గరిష్టంగా రూ. 1.5 లక్షల చికిత్స ఖర్చు తక్షణమే అందజేస్తుందని గడ్కరీ చెప్పారు.